టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
రామన్నపేట: సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ కోరారు. ఉపాధ్యాయులు టెట్‌లో తప్పనిసరి ఉత్తీర్ణత సాధించని పక్షంలో సర్వీసు నుంచి తొలగించే విధానంను రూపకల్పన చేయడాన్ని నిరసిస్తూ శనివారం రామన్నపేట కాంప్లెక్స్ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ.. విద్యాహక్కు చట్టం అమలులోకి రాకముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించడం సరికాదని, చట్ట సవరణ ద్వారా మినహా యింపు ఇవ్వాలని కోరారు.,కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిలువేరు అనిల్‌కుమార్, ఉయ్యాల భిక్షమయ్య, మంకాల కుమారస్వామి, పల్లె మోహన్‌రెడ్డి,సురేష్, రాములు, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, నిర్మలాదేవి, సంతోష్, కవిత, శ్రీలత, రేణుక, లింగస్వామి, నరేందర్, భార్గవి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.


