దొంగ అరెస్టు
దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసి అతని వద్ద రూ.4లక్షల18వేల నగదుతోపాటు, 5 గ్రాముల బంగారం, కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి శనివారం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన పగిళ్ల శివ పదో తరగతి వరకు చదివి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనుకుని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈనెల 11న దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్‌కు చెందిన శరావత్ జబ్బార్ ఇంట్లో రూ. 8లక్షలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు శనివారం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శివను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. కాగా.. ఇతడిపై రాష్ట్ర వ్యాప్తంగా 11 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు నారాయణరెడ్డి, రాజు,సిబ్బంది సతీష్, అంజయ్య, సింహాద్రి, చాంద్‌పాషా, హరిబాబు, యాదయ్య తదితరులు ఉన్నారు.
ఫ రూ.4.18లక్షల నగదు స్వాధీనం


