పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి
బీబీనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీబీనగర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాన్ని శనివారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రా ష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
వైద్య, విద్యకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే కుంభం
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని, దాన్ని చక్కబెట్టే పనిలో సీఎం రేవంత్ ఉన్నారని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గానికి హెచ్‌ఎండీఏ నిధులు రూ.56 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. అంతకు ముందు మాదారం, ముగ్దుంపల్లి తదితర గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ హనుమంతురావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, పీఆర్ ఈఈ దాసయ్య, గంథాలయ చైర్మన్ అవైచీ చిస్తీ, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్ అఫీసర్ మౌనిక, ఏఈ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి


