ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు
వలిగొండ, మోటకొండూరు : ధాన్యం ఎగుమతి చేయడానికి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపకుంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం ఆయన వలిగొండ, సంగెం, సుంకిశాలలోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. లారీలు రాకపోవడంతో ధాన్యం ఎగుమతిలో జాప్యం జరుగుతుందని, కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతున్నాయని పలువురు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఫోన్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడారు. ప్రతి కేంద్రానికి రోజూ కనీసం మూడు లారీలు పంపాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ఐకేపీ సెంటర్‌ను కలెక్టర్ సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


