పంతంగిలో నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
చౌటుప్పల్ : మండల పరిధిలోని పంతంగి గ్రామంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా సమాఖ్య యాదాద్రి జిల్లా కార్యదర్శి కందాడి దశరథరెడ్డి తెలిపారు. ఈమేరకు పోటీలు జరగనున్న జెడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం ఎంఈఓ గురువారావుతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దశరథరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 25 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి బాల, బాలికల జట్ల కోసం 240మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


