
విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
భువనగిరిటౌన్ : పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు అన్నారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో జగన్ మోహన్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్కాలర్‌షిప్స్ రాక విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయిందన్నారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కుక్కుట్ల శివాని, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్, జగన్ నాయక్, గాయత్రి, సహాయ కార్యదర్శి తిగుళ్ల శ్రీనివాస్ పుట్టల ఉదయ్, హిందూ రాణి, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ నేహాల్, నరేందర్, పూజిత, శ్రావణ్, మహేష్, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా