
వల్లభాయ్ పటేల్‌తోనే నిజాం పాలనకు విముక్తి
చౌటుప్పల్ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండతోనే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి పర్యటనకు వెళ్తున్న ఆయన మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళా నేతలు తిలకం దిద్ది స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం రాంచందర్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నైజాం దుర్మార్గపు పాలనకు అనేక సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆనాటి నైజాం బాధితుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మాజీ సర్పంచ్ రమనగోని దీపిక, పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన, నాయకులు దోనూరి వీరారెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, బత్తుల జంగయ్య, ఊడుగు యాదయ్య, వెంకటేశం, కడారి అయిలయ్య, వనం ధనుంజయ్య, ఊదరి రంగయ్య, ఇటిక్యాల దామోదర్‌రెడ్డి, బాతరాజు ప్రవీన్, గుండెబోయిన వేణు, బుడ్డ సురేష్, తోకల సాయి, నల్ల శివప్రసాద్, అమృతం దశరథ, పర్నె గాయత్రి, ఊదరి శారద, బత్తిని విజయలక్ష్మి, శేఖర్‌రెడ్డి, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు