
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
భువనగిరిటౌన్ : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ, టీజీఎంఎస్ సంక్షేమ హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, హెచ్‌డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. నాణ్యత కలిగిన వంట సరుకులు, కూరగాయలు వాడాలన్నారు. సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి జినుకల శ్యాంసుందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పరంకుశ సాహితీ పాల్గొన్నారు.
డిసెంబర్‌లోపు పూర్తిచేయాలి
ఉపాధి హామీ నిధులతో పంచాయతీ రాజ్ విభాగం ద్వారా చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల ప్రహరీ నిర్మాణ పనుల ప్రగతి, వాటర్‌షెడ్ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ పనుల ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సమీక్ష నిర్వహించారు. పనులు డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలకు వాచ్ వార్డు పర్సన్లను నియమించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలచందర్, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ సురేష్ పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు