
నష్టపరిహారం ఇవ్వకుంటే ఉద్యమిస్తాం
భువనగిరిటౌన్ : వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి, ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరాజు, కల్లూరి మల్లేశం, పాండు, పెంటయ్య, కృష్ణారెడ్డి, స్వామి, మాయ కృష్ణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేష్, రాగిరు కిష్టయ్య, గణపతిరెడ్డి పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య