
ప్రో కబడ్డీ లీగ్ అంపైర్‌గా కొంపెల్లి వీరస్వామి
సూర్యాపేటటౌన్, గరిడేపల్లి: వివిధ దేశాల క్రీడాకారులు పొల్గొంటున్న ప్రో కబడ్డీ లీగ్‌లో టెక్నికల్ అఫీషియల్(అంపైర్)గా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి ఎన్నికై నట్లు సూ ర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నరసింహరావు మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. వీరస్వామి ఎంపికకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా నుంచి ప్రో కబడ్డీ లీగ్ అంపైర్‌గా వీరస్వామి ఎంపిక కావడం గర్వకారణమన్నారు.
ఇంపాక్ట్ ఉత్తమ ప్రాజెక్టు
డైరెక్టర్‌గా శ్రీలత
నేరేడుచర్ల: ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్(ఐసీఐ) ఉత్తమ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నేరేడుచర్లకు చెందిన వీరవెల్లి శ్రీలత ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో గల ఐసీఐ కార్యాలయంలో ఆమె అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలతను పలువురు మహిళలు ఘనంగా సత్కరించారు. సన్మానించిన వారిలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షురాలు మాధవి, నారీ సెల్ అడ్వైజర్ నళిని, జాతీయ ఉపాధ్యక్షురాలు రాజేశ్వరీ, యంగ్ అండ్ డైనమిక్ నారీ సెల్ డైరెక్టర్ దేవరపల్లి తబిత, సంధ్యారాంకరణం, సునీత, జగదీశ్వరీ, నవనీత, విజయలక్ష్మి, కీర్తీ శ్రీవాణి తదితరులున్నారు.
తెలంగాణ బుక్ ఆఫ్
రికార్డ్స్‌లో చోటు
నకిరేకల్: నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన బచ్చుపల్లి ఇషాన్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. బచ్చుపల్లి నవీన్, పావని దంపతుల కుమారుడైన ఇషాన్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇషాన్ తల్లి ఖమ్మంలోనే బ్యాంకులో జాబ్ చేస్తుండగా.. తండ్రి నల్లగొండలో ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ నల్లగొండలోనే నివాసముంటున్నారు. ఇషాన్ కళ్లకు గంతలు కట్టుకుని వరుసగా 16 దేశభక్తి గీతాలను పియానోపై వాయించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇషాన్ రికార్డు సాధించడం పట్ల మంగళపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
తిరుమలగిరి (తుంగతుర్తి): యూరియా కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండలం మాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె కృష్ణ (25) యూరియా కోసం సోమవారం ఉదయం తిరుమలగిరికి వచ్చాడు. తిరిగి రాత్రి సమయంలో మాసిరెడ్డిపల్లికి వెళ్లేందుకు గాను తిరుమలగిరి మండలం కేంద్రంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రో కబడ్డీ లీగ్ అంపైర్‌గా కొంపెల్లి వీరస్వామి

ప్రో కబడ్డీ లీగ్ అంపైర్‌గా కొంపెల్లి వీరస్వామి