
ప్రతి తప్పుకు ఒక లెక్క ఉంది !
తిరుమలగిరి (తుంగతుర్తి): సాధారణంగా చదువు, ఆటల్లో ఎన్ని ఎక్కువ మార్కులు లేదా పాయింట్లు సాధిస్తే అంత గుర్తింపు ఉంటుంది. కానీ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న ప్రతి పెనాల్టీ పాయింట్‌కు ఒక లెక్క ఉంది. ఎంత తక్కువ పాయింట్ల ఉంటే అంత జరిమానా నుంచి మినహాయింపు ఉంటుంది. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. వాహనదారులు చేసే తప్పుల నుంచి మే ల్కొనేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చలానా చెల్లించినా లెక్క తగ్గదు..
నిబంధనలు అతిక్రమించి జరిమానా కట్టేశాను అని అనుకుంటే సరిపోదు. చేసిన తప్పులకు ఆన్‌లైన్‌లో పెనాల్టీ పాయింట్లు కేటాయిస్తారు. ఇది 12 పాయింట్లు దాటితే ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. మరోసారి 12 పాయింట్లు దాటితే రెండు సంవత్సరాల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. మూడోసారి కూడా 12 పాయింట్లు దాటితే శాశ్వతంగా లైసెన్స్ కోల్పోతారు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్న సమయంలో 5 పాయింట్ల పరిమితి దాటితే లైసెన్స్ పొందే అవకాశం ఉండదు.
ట్రాఫిక్ ఉల్లంఘనకు పాయింట్ల ఇలా..
● కారులో సీటు బెల్ట్, ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకుంటే – 1 పాయింట్
● సిగ్నల్ జంప్, ఫోన్‌లో మాట్లాడుతూ
డ్రైవింగ్ చేస్తే – 2
● మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపితే – 3
● మద్యం తాగి కారు, లారీ, గూడ్స్ వాహనం
నడిపితే – 4
● వాహనాలతో రేసింగ్‌కు పాల్పడితే – 3
● వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోతే – 2
ఇలా తెలుసుకోవచ్చు
గూగుల్‌లో పబ్లిక్ వ్యూ అని టైప్ చేస్తే తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్, ఈ–చలాన్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి అందులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేస్తే పాయింట్ల వివరాలను తెలుసుకోవచ్చు.
ఫ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే
పెనాల్టీ పాయింట్‌ల విధింపు
ఫ ఏడాదికి 12 పాయింట్లు
దాటితే లైసెన్స్ రద్దు