
బీసీ రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
భువనగిరిటౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సోమవారం డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో బాణసంచా కాల్చి ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బుద్ధిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోత్నక్ ప్రమోద్‌కుమార్, ఈవీ శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్, బీజేపీలు గల్లీలో జై, ఢిల్లీలో నై అంటున్నాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుతో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. బిల్లుకు చట్టబద్ధత కల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు బీసీల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ తంగెళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.