
ఎవరా అదృష్టవంతులు..
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో నవయుగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రూ.1.15లక్షలతో 24 క్యారెట్ల బంగారంతో చేసిన చిన్న వినాయక ప్రతిమను ఉంచి నిత్యం పూజలు చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది మొదటిసారి బంగారు ప్రతిమను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. లడ్డుకు రూ.116, బంగారు ప్రతిమకు రూ.516తో లక్కీ డ్రా ఏర్పాటు చేశామని, డ్రాలో గెలుచుకున్న వారికి బంగారు వినాయకుడి ప్రతిమ ఇవ్వనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకుడు చిట్టిపోలు మట్టపల్లి, సభ్యులు తెలిపారు.

ఎవరా అదృష్టవంతులు..