
నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట: కెనడా దేశ రాజధాని ఒట్టావా నగరంలో శనివారం రాత్రి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఆగస్టు 22న కెనడా దేశానికి యాదగిరిగుట్ట ఆలయ విశ్రాంత ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజివెల్లి రఘు వెళ్లారు. 23న విండ్సర్, 24న టొరంటో నగరంలో కల్యాణ వేడుకలను నిర్వహించారు. శనివారం రాత్రి ఒట్టావా నగరంలో నిర్వహించిన యాదగిరీశుడి కల్యాణోత్సవంలో హిందూ ధర్మ ప్రచారకులు చంద్ర ఆర్య, మాజీ ఎంపీ కరుణాకరరెడ్డి, టీసీఏ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెంతో పాటు భక్తులు పాల్గొన్నారు.