
ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం
మఠంపల్లి: బైక్‌పై వెళ్తూ ట్రాక్టర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మఠంపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి గౌతమ్(17), అతడి స్నేహితులు పవన్, సాయి ఆదివారం రాత్రి బిర్యానీ తెచ్చుకునేందుకు మఠంపల్లి మండల కేంద్రానికి బైక్‌పై వచ్చారు. తిరిగి బైక్‌పై చౌటపల్లి వెళ్తుండగా.. మట్టపల్లిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి మఠంపల్లి మండల కేంద్రంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న గౌతమ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. స్వల్ప గాయాలైన సాయి హుజూర్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మఠంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.