
యాదగిరీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ముఖ మండపం క్యూలైన్, మాడ వీధులు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండుగా కనిపించాయి. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి వారిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.26,52,441 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.