
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక పట్టివేత
కొండమల్లేపల్లి: డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. వివరాలు.. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ బి. సంతోష్‌రెడ్డి ఆదేశాల మేరకు నల్లగొండ, దేవరకొండ ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి దేవరకొండకు డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 60క్వింటాళ్ల నల్లబెల్లం, 100 కిలోల పటికను పట్టుకున్నారు. పట్టుబడిన నల్లబెల్లం, పటికను సీజ్ చేసి దేవరకొండ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, అందులో ఒకరు అరెస్ట్ చేయగా.. ముగ్గురు పరారీలో ఉన్నట్లు దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన నలుగురిలో ఇద్దరు కొండమల్లేపల్లి మండల పరిధిలోని మేఘ్య తండాకు చెందిన వారు కాగా.. మరొకరిది ఏపీలోని గుంటూరు, ఇంకొకరిది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన వారని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ నరసింహ, కానిస్టేబుళ్లు శేఖర్‌రెడ్డి, నాగరాజు, అనిల్‌కుమార్, ఎం. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నలుగురిపై కేసు నమోదు