
మూడో రోజూ రాకపోకలు బంద్
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని జూలూరు వద్ద శనివారం కూడా లోలెవల్ బ్రిడ్జి పైనుంచి మూసీ ఉధృతి కొనసాగింది. దాంతో భూదాన్‌పోచంపల్లి నుంచి బీబీనగర్‌కు మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న బీబీనగర్ మండలం రుద్రవెల్లికి చెందిన 20 మంది విద్యార్థులు వరద కారణంగా మూడు రోజులుగా బడికి వెళ్లలేదు. మూసీ పొంగడం వల్ల ఈ నెలలో 10 రోజులు బడికి గైర్హాజరయ్యారు. రాకపోకలు నిలిచిన కారణంగా బీబీనగర్ ఎయిమ్స్ వెళ్లే రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. పోచంపల్లి మండల ప్రజలు భువనగిరికి పెద్దరావులపల్లి మీదుగా చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు స్పందించి నిలిచిపోయిన హైలెవల్ బ్రిడ్జి పనులను పూర్తి చేయించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.