
భూములిచ్చాం.. ఉపాధి కల్పించండి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూములు ఇచ్చామని.. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిపల్లికి చెందిన బూడిద కులస్తులు శనివారం యాదగిరిగుట్ట ఆలయ డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మకు వినతిపత్రం అందజేశారు. ఆలయంలో టెండర్లు లేకుండా చెప్పులు భద్రపరిచే బాధ్యతలు ఇవ్వాలని, స్వామివారి నిత్యకల్యాణంలో డప్పులు వాయించే అవకాశం కల్పించాలని, దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో తమ కులస్తులను నియమించాలన్నారు. కోరారు. కార్యక్రమంలో నర్సింహ, నాగరాజు, ఐలయ్య, మల్లేశ్, యాదగిరి, అయిలయ్య, దేవేందర్, రాములు, కుమార్, వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ మనోహర్ అన్నారు. శనివారం భువనగిరి మండలం అనంతారం పరిధిలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి, వ్యక్తిగత శుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు.
వాహనాల దారి మళ్లింపు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. తుర్కపల్లి, మల్లాపూర్ గ్రామాలకు వెళ్లే వాహనాలను పాత వాసవిసత్రం నుంచి తులసి సత్రం మీదుగా రెడ్డి సత్రం దగ్గర తుర్కపల్లి మెయిన్ రోడ్డుకు మళ్లించనున్నారు. తుర్కపల్లి, మల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలను రింగ్ రోడ్డులోని యాదవఋషి సర్కిల్ నుంచి గరుడ సర్కిల్ మీదుగా వైకుంఠ్వారం వైపు మళ్లించనున్నారు. ఇక్కడినుంచి భారీ వాహనాలకు అనుమతి లే దని, వైకుంఠద్వారం నుంచి గరుడ యాదవఋషి సర్కిళ్ల గుండా మల్లాపూర్, తు ర్కపల్లి రావడానికి, పోవడానికి వీలు కల్పించారు.

భూములిచ్చాం.. ఉపాధి కల్పించండి

భూములిచ్చాం.. ఉపాధి కల్పించండి