
శ్రీవాణి తరహాలోనే గరుడ ట్రస్టు
యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిన విధంగానే యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం శ్రీగరుడ ట్రస్టును ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన విధి విధానాలను శనివారం ఆలయ ఈఓ వెంకట్రావు వెల్లడించారు. గరుడ స్కీంకు వచ్చే విరాళాలలను గరుడ ట్రస్టు పేరుతో అకౌంట్ ప్రారంభించి విద్య, వైద్యం, ప్రసాద వితరణ నిర్వహణకు వినియోగించనున్నారు. ఈ ట్రస్టును ఈ నెల 15న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించగా.. 29వ తేదీన విధి విధానాలను రెవెన్యూ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పరిశీలించి విడుదల చేశారు.
మూడు స్లాట్లు.. ప్రత్యేక కూపన్లు..
గరుడ ట్రస్టును మూడు స్లాట్లుగా ఏర్పాటు చేశారు. విరాళాలుగా చెల్లించిన భక్తులకు వసతి కూపన్స్, దర్శనం కూపన్స్ అందజేసి దర్శన సదుపాయాలను కల్పించడంతో పాటు బాండ్ సైతం అందజేయనున్నారు. గరుడ స్కీంలో విరాళాలు సమర్పించే భక్తులు దేవస్థానం సెల్‌లో విరాళాలు సమర్పించి బాండ్, కూపన్స్‌ను పొందాలని ఆలయాధికారులు సూచిస్తున్నారు.
స్కీం వివరాలు ఇలా..
ఫ రూ.50వేలు విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో రెండు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్‌టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్‌పై సంవత్సరంలో రెండు సార్లు ఆరుగురికి లైఫ్ టైమ్ ఉంటుంది. విరాళం చెల్లించిన మొదటిసారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం (కల్యాణ శెల్లా, కనుము) అందజేస్తారు.
ఫ రూ.లక్ష విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో నాలుగు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్‌టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్ పై సంవత్సరంలో నాలుగు సార్లు ఆరుగురు చొప్పున లైఫ్‌టైమ్ ఉంటుంది. విరాళం చెల్లించిన మొదటి సారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం అందజేస్తారు.
ఫ రూ.2లక్షల విరాళం చెల్లించిన భక్తులకు రూ.300 బ్రేక్ దర్శనాన్ని సంవత్సరంలో మూడు సార్లు ఎనిమిది మంది చొప్పున లైఫ్‌టైమ్ ఇవ్వనున్నారు. రూ.150 ప్రత్యేక దర్శనం టిక్కెట్ పై సంవత్సరంలో 8 సార్లు ఆరుగురికి దర్శనం ఉంటుంది. అంతే కాకుండా కొండ కింద యాదరుషి నిలయంలో డబుల్ బెడ్‌రూం గదిని సైతం కేటాయిస్తారు. వీటితో పాటు విరాళం చెల్లించిన మొదటి సారి శ్రీస్వామి వారి అభిషేకం లడ్డూ ప్రసాదం, శేష వస్త్రం బహూకరిస్తారు.
ఫ ట్రస్టు ద్వారా వచ్చిన సొమ్ము విద్య, వైద్యం, ప్రసాద వితరణకు వినియోగం
ఫ దాతలకు ప్రత్యేక దర్శన భాగ్యం
ఫ విధివిధానాలు విడుదల చేసిన
ఆలయ ఈఓ