
ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ పోటీలు
భువనగిరి : భువనగిరి పట్టణంలోని సువాలి ఎస్టేట్‌లో గల న్యూ డైమెన్షన్ స్కూల్ ఆవరణంలో కొనసాగుతున్న అండర్–18 జూనియర్స్ బాలబాలికల అంతర్జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు శనివారం ముగిశాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆరు రోజుల పాటు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ముగింపు రోజున జరిగిన ఫైనల్స్‌లో గెలుపొందిన వారికి మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ అకాడమీ ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్, తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ మేనేజర్ వైభవ్ పటేల్, ,జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దిడ్డి బాలాజీ, ప్రధాన కార్యదర్శి కలీం అహ్మద్, సంయుక్త కార్యదర్శి పరమేష్‌కుమార్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.
విజేతలు ఎవరంటే..
బాలుర సింగిల్స్ ఫైనల్‌లో వ్రజ్ గోహిల్(ఇండియా), డెవ్ విఫుల్ పటేట్ (ఇండియా)పై 6–1, 6–4 తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో స్నిగ్ధకాంత (ఇండియా), ఐశ్వర్య జాదవ్(ఇండియా)పై 5–7, 6–2,6–0 గెలుపొందింది. బాలుర డబుల్స్ ఫైనల్‌లో ఽథామస్, కాప్పి (ఫ్రాన్స్), ప్రణవ్ మహేష్ సరవణకుమార్ (ఇండియా)లు, హృథిక్ కాటకం(ఇండియా), ప్రకాష్ సారణ్(ఇండియా)పై 6–4, 6–0తేడాతో విజయం సాధించారు. బాలికల విభాగంలో నైనికా నరేందర్‌రెడ్డి బేండ్రం(ఇండియా), స్నిగ్ధ కాంత(ఇండియా)లు, శ్రీనిత్తి చౌదరి(ఇండియా), హర్షకార్తిక ఊరగంటి(ఇండియా)పై 5–1 తేడాతో రిటైర్డ్ మ్యాచ్‌లో విజయం సాధించారు.

ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ పోటీలు