
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి
భువనగిరిటౌన్ : పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం సురక్షితమైన వాతావరణం కల్పించాలని కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లతో నిర్వహించిన ఇంటర్‌ఫేస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల రక్షణ, అభివృద్ధి, సాధికారత కోసం అనేక చట్టాలు, పాలసీలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోష్ (పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం) యాక్ట్ –2013 క్యాంపేయిన్‌లో భాగంగా యాక్షన్ ఎయిడ్ సంస్థ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుందని, మన జిల్లాలో కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. పోష్ చట్టం నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని సంస్థల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 150 కమిటీలు పూర్తయినట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, యాక్షన్ ఎయిడ్ కమిటీ సభ్యురాలు యాక్షన్ ఎయిడ్ సంస్థ కార్యక్రమాలపై మాట్లాడారు. కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ సంస్థ కమ్యూనిటీ ట్రైనర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం, డీఎంహెచ్‌ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, ఆశా కార్యకర్తల నోడల్ ఆఫీసర్ డాక్టర్ వీణ, సీడీపీఓలు శైలజ, జ్యోత్స్న, ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రమీళ, డీఎల్‌ఎస్‌ఏ అడ్వకేట్‌లు రాజశేఖర్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు