
సాదాబైనామా.. సాకారం
‘భూ భారతి’ప్రకారం ముందుకెళ్తాం
కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సాదాబైనామా కోసం వచ్చిన పలు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. భూ భారతి చట్టం ప్రకారం వీటికి పరిష్కారం లభిస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. ఈ రకంగా వాటిలో కొన్ని సాదాబైనామాలకు నోటీస్ ఇచ్చారు. కొన్ని దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. ప్రభుత్వ భూముల నుంచి దరఖాస్తులు వచ్చాయి. సాదా కాగితాల మీద అమ్మిన రైతులు ప్రభుత్వ రికార్డుల్లో లేరు. కొన్ని రికార్డుల్లో సర్వే నంబర్లు వేయలేదు. ఒకటి అంతకంటే ఎక్కువ సార్లు అమ్మకం, గతంలోనే పట్టా సర్టిఫికెట్ జారీ చేయడం, కొన్నిచోట్ల ఇళ్ల స్థలాలు ఉండటం, ఐదు ఎకరాలపైన భూమి ఉండడం, కోర్టు కేసులు, రక్త సంబంధికులకే అమ్మడం వంటివి దరఖాస్తులు వచ్చాయి.
సాక్షి,యాదాద్రి: సాదాబైనామాలకు మోక్షం కలగనుంది. లిఖితపూర్వక ఒప్పందంతో కొనుగోలు చేసిన భూములకు సంబంధించి రికార్డులు లేకపోవడం, పట్టాదారులుగా గుర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్‌ను ఈనెల 26న కొట్టివేసింది. 2014 జూన్ 2కు ముందు రైతుల అధీనంలో ఉన్న భూములను ఆధారాల ప్రకారం క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది.
ఆర్‌ఓఆర్‌లో పట్టాలు
గతంలో భూముల కొనుగోలు సాదా కాగితాలపై జరిగింది. కొనుగోలు చేసిన రైతులకు భూములు అమ్మిన రైతులు కబ్జా ఇచ్చారు. కానీ, పట్టా మార్పిడి కాలేదు. ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం సాదా కాగితాల మీద కొనుగోలు చేసిన భూములకు పట్టా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాదాబైనామాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాగా సాదాబైనామాలో కొనుగోలు చేసిన భూములకు చట్టబద్ధత కల్పించి పాస్ పుస్తకాలు జారీ చేయాలని గత ప్రభుత్వం 2020 నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ధరణి పోర్టల్‌లో సాదాబైనామాల రిజిస్ట్రేషన్ కాలమ్ విస్మరించింది. దీంతో కాగితాల మీద కొనుగోలు చేసిన భూములకు ధరణిలో పేర్లు రాలేదు. అమ్మిన రైతుల పేర్లే మళ్లీ వచ్చాయి. దీంతో ధరణి వివాదాలకు కేంద్రమైంది.
మండలం దరఖాస్తులు
బీబీనగర్ 881
మోటకొండూరు 915
రామన్నపేట 1519
వలిగొండ 1987
ఆత్మకూర్ 460
తుర్కపల్లి 859
మోత్కూరు 1318
పోచంపలి 943
భువనగిరి 1641
బొమ్మలరామారం 1231
గుండాల 2218
యాదగిరిగుట 604
నారాయణపురం 1352
రాజపేట 1355
చౌటుప్పల్ 1043
అడ్డగూడూరు 2905
ఆలేరు 1194
ఫ హైకోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకులు
ఫ 22,450 దరఖాస్తులకు మోక్షం
ఫ క్రమబద్ధీకరణతో భూ హక్కులు వర్తింపు
సాదాబైనామాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు అందలేదు. భూ భారతి చట్టం ప్రకారం ముందుకెళ్తాం. చిన్న,సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది.
–జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్
గత ప్రభుత్వంలో, తాజాగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 22,425 దరఖాస్తులు వచ్చాయి. హెచ్‌ఎండీఏ మండలాలతో పాటు మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో కూడా సాదాబైనామాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. 2020 అక్టోబర్ నుంచి 2020 నవంబర్ 10 వరకు తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకం చట్టం–1971 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించుకోవచ్చని కోర్టు తెలిపింది.

సాదాబైనామా.. సాకారం