
15న ఎంజీయూ స్నాతకోత్సవం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం యూనివర్సిటీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరవుతారని పేర్కొన్నారు. పీజీ విద్యార్థులకు 57 బంగారు పతకాలు, 22 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందించనున్నామని వెల్లడించారు. అంతకుముందు బోధన, బోధనేతర సిబ్బందికి విధులు, బాధ్యతలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఈఓ ఉపేందర్‌రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆలయ ఏఈఓగా పదోన్నతి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పర్యవేక్షకుడు నాగుల మహేష్ కు ఏఈఓగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రెవెన్యూ, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ శుక్రవారం ఆయనకు ఉత్తర్వులు అందజేశారు.మహేష్ గత సంవత్సరం బదిలీల్లో భాగంగా వేములవాడ రాజరాజేశ్వరిస్వామి ఆలయం నుంచి యాదగిరి క్షేత్రానికి వచ్చారు. ఆలయ పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఆయనకు ఏఈఓగా పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలి
భువనగిరిటౌన్ : సెప్టెంబర్ 1వ తేదీన పెన్సన్ విద్రోహ దినంగా పాటించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి పట్టణంలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానం ఉద్యోగస్తుల పాలిట శాపంగా మారిందన్నారు. 1వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఎదుట వెయ్యి మంది ఉద్యోగులతో నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్ ప్రసాద్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు భగత్, ఉద్యోగ సంఘాల నాయకులు మహమ్మద్ కదీర్, అమరేందర్‌రెడ్డి, యాదయ్య, లక్ష్మీనరసింహారెడ్డి, బోయ రాములు, శ్రీకాంత్, శ్రీనివాస్, నర్సింహ, గణగాని శశికాంత్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కత్తుల కుమార్, శ్రీనివాస్, బాలేశ్వర్, అరుణ, బాలరాజు పాల్గొన్నారు.
ఉన్నత పాఠశాల తనిఖీ
భువనగిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలను శుక్రవారం డీఈఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హెచ్‌ం, ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని, నిర్ణీత సమయం ప్రకారం విద్యార్థులకు స్లిప్ టెస్ట్‌లు, ఎఫ్‌ఏ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్థన్‌రెడ్డి, హెచ్‌ఎం నరసింహులు, ఉపాధ్యాయులు యాదమ్మ, రేణుక, రజిత, వీరారెడ్డి, పీడీ జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

15న ఎంజీయూ స్నాతకోత్సవం

15న ఎంజీయూ స్నాతకోత్సవం