
ఇళ్ల నిర్మాణంలో ఫస్ట్
సాక్షి, యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆగస్టు మాసానికి రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రఽథమ స్థానంలో నిలిచింది. రెండు విడతల్లో 9,495 ఇళ్లు మంజూరు కాగా.. 7,730 ఇళ్లకు మా ర్కింగ్ ఇచ్చారు. ఇందులో బేస్మెంట్ లెవల్ 4,951, రూప్ లెవల్ 833, స్లాబ్ లెవల్ 226 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.44.94 కోట్లు జమ చేశారు.
కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ
కలెక్టర్ హనుమంతరావు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.అదనపు కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు సహకరించడంతో పాటు సమీక్షలు, క్షేత్ర పర్యటనలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
ఎమ్మెల్యేల ప్రోత్సాహం
ఎమ్మెల్యేలు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దివ్యాంగులు, వితంతువుల ఇళ్ల నిర్మాణాలకు 50 బస్తాల సిమెంట్ ఉచితంగా ఇస్తున్నారు. అదే విధంగా గృహప్రవేశం సమయంలో యజమానులకు మేకపోతు, ఇంటిల్లిపాదికి నూతన వస్త్రాలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు. భు వనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి గృహప్రవేశం చేసే వారికి నూతన వస్త్రాలు అందజేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి
భువనగిరి ఆలేరు తుంగతుర్తి మునుగోడు నకిరేకల్
మంజూరు 3,280 3,639 573 1,314 689
ప్రారంభం కానివి 628 662 91 239 145
మార్కౌట్ ఇచ్చినవి 2,652 2,977 482 1,075 544
బేస్మెంట్ లెవల్ 1,673 1,974 338 752 214
లెంటల్ 257 352 68 125 26
స్లాబ్.. 65 91 30 21 19
పూర్తయినవి 01 06 01 01 01
లబ్ధిదారులకు రుణాలు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు నిర్మించుకోలేకపోతున్న లబ్ధిదారులకు ఆర్థికంగా సహకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల పరిశీలనకు వెళ్లగా పలువురు లబ్ధిదారులు తమ సమస్యలు తెలియజేస్తున్నారు. అటువంటి వారికి స్వయం సహాయక మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.14 కోట్ల రుణాలు ఇప్పించారు.
ఆగస్టు మాసానికి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం
ఫ వివిధ దశల్లో 7,730 గృహాలు
ఫ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.44 కోట్లు జమ
ఫ ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారుల
నిరంతర పర్యవేక్షణ
ఫ లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సాహం