
పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి
యాదగిరిగుట్ట రూరల్: పాఠశాలల అభివృద్ధికి గ్రామపెద్దలు చేయూతనివ్వాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాతలు కొమ్ము నాగరాజు రూ.1,40,000తో డ్యూయల్ డెస్క్ బేంచీలు, అమర్నాఽథ్‌రెడ్డి లక్ష రూపాయలతో క్రీడా దుస్తులు బహూకరించగా వాటిని డీఈఓ సత్యనారాయణతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. అందులో భాగంగానే ఆంగ్ల విద్య, నాణ్యతతో కూడిన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు. అనంతరం దాతలను అభినందించారు. అలాగే టెన్త్‌లో ఉత్తమ ర్యాంకుల సాధించిన గవ్వల రక్షిత, నమిలె శ్రీనిధికి మాజీ సర్పంచ్ కానుగు కవిత బాలరాజ్‌గౌడ్, డాక్టర్ అమరేందర్ నగదు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శరత్‌యామిని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు