
బోటులో ప్రయాణించి.. సూచనలిచ్చి
భువనగిరి, బీబీనగర్: గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని రాచకొండ సీపీ సుధీర్‌బాబు శుక్రవారం భువనగిరి పెద్దచెరువు, రాయగిరి చెరువును సందర్శించారు. రాయగిరి చెరువులో బోట్‌పై ప్రయాణించి పరిశీలించారు. నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. చెరువుల్లో నీరు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బీబీనగర్ పెద్దచెరువును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నందున నిర్వాహకులు గణేష్ విగ్రహాలను బీబీనగర్‌కు తరలించే అవకాశం ఉందన్నారు. చెరువు జాతీయ రహదారి పక్కన ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ పోలీస్‌లకు సూచించారు. ఆయన వెంట డీసీపీ అక్షాంశ్‌యాదవ్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు రాహుల్‌రెడ్డి, శ్రీనివాస్‌నాయుడు, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్, సీఐలు ప్రభాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్ ఉన్నారు.
ఫ భువనగిరి, రాయగిరి చెరువులను పరిశీలించిన సీపీ సుధీర్‌బాబు