
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
కట్టంగూర్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.105 కోట్ల నిధులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో మంజూరైన పనులను మార్చకుండా అక్కడే ఖర్చు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లు వినియోగంలో లేకుండా పోవటంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కట్టంగూర్‌లో పెద్దవాగుపై రెండు బ్రిడ్జిలు నిర్మించేందుకు రూ.4కోట్లు మంజూరు చేయించానని ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, పోగుల నర్సింహ, గడుసు కోటిరెడ్డి, చెవుగోని జనార్దన్, బెల్లి సుధాకర్, గుండగోని రాములు, మేడిరాములు, దాసరి సంజయ్, మునుగోటి ఉత్తరయ్య పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య