హత్య కేసును ఛేదించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసును ఛేదించిన పోలీసులు

Aug 30 2025 7:08 AM | Updated on Aug 30 2025 7:08 AM

హత్య కేసును ఛేదించిన పోలీసులు

హత్య కేసును ఛేదించిన పోలీసులు

నల్లగొండ: నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి కళాశాల వద్ద బుధవారం రాత్రి ఓ వ్యక్తి హత్యకు గురికాగా.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన షేక్‌ సిరాజ్‌ అనే వ్యక్తి హుస్సేన్‌ దగ్గర లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. నెల క్రితం లారీలో లోడ్‌తో నల్లగొండ నుంచి వెళ్తున్న క్రమంలో హుస్సేన్‌తో షేక్‌ సిరాజ్‌ గొడవ పడ్డాడు. దీంతో సిరాజ్‌ను డ్రైవర్‌ లారీ నుంచి దింపేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సిరాజ్‌ నల్లగొండ పట్టణంలో ఉంటూ అన్నపూర్ణ క్యాంటిన్‌ వద్ద రూ.5 భోజనం చేస్తూ చుట్టుపక్కల భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి కళాశాల వద్ద నిద్రపోయేవాడు.

దూషించాడన్న కక్షతో..

15 సంవత్సరాల క్రితం నల్లగొండకు వలస వచ్చి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్‌ (40) మద్యం మత్తులో ఈనెల 27న రాత్రి సమయంలో సిరాజ్‌ పడుకునే స్థలం వద్దకు వచ్చాడు. సిరాజ్‌ నిద్రపోయేందుకు వేసుకున్న పట్టాలో రమేష్‌ నిద్రించాడు. ఇక్కడ ఎందుకు నిద్రిస్తున్నావని సిరాజ్‌ అతడిని అడగగా.. రమేష్‌ మద్యం మత్తులో దుర్భాషలాడాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో చంపేస్తానని రమేష్‌ను సిరాజ్‌ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూడగా.. రమేష్‌ అక్కడే నిద్రపోయి ఉండడంతో పక్కనే ఉన్న గ్రనైట్‌ రాయి తీసుకుని అతడి తలపై కొట్టాడు. రాయి దొరకకుండా కళాశాల గోడ వెనుక పడేసి అక్కడ నుంచి పరారయ్యాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని గురువారం ఉదయం పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాలను పరిశీలించి, 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నల్లగొండలోని రహమాన్‌బాగ్‌లో నిద్రిస్తున్న సిరాజ్‌ను వన్‌టౌన్‌ పోలీసులు పట్టుకుని విచారణ చేయగా తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రాయిని చూపించగా దానిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో వన్‌టౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకటనారాయణ, ఏఎస్‌ఐ వెంకట్‌యాదవ్‌, సిబ్బంది రబ్బాని, షకీల్‌, శ్రీకాంత్‌, శంకర్‌, జానకిరాములు, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

ఫ తను నిద్రించే స్థలంలో వేరే వ్యక్తి వచ్చి నిద్రపోవడంతో తలెత్తిన వివాదం

ఫ దుర్భాషలాడాడన్న కోపంతో

రాయితో కొట్టి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement