
ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన మూడు కిలోమీటర్ల పరుగు పందెంలో 70 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులు మరింత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి గుర్తింపు తేవాలని విజేతలకు సూచించారు. అనంతరం స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసిన క్యాలెండర్, పోస్టర్లను వీసీ విడుదల చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, హరీష్ కుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, మురళి, శ్రీనివాసరెడ్డి, కోఆర్డినేటర్ శివశంకర్ పాల్గొన్నారు.
గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు
అనంతగిరి: గోండ్రియాల వద్ద పాలేరు వాగులో గురువారం గల్లంతైన కిన్నెర ఉపేందర్ మృతదేహం కోసం శుక్రవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోండ్రియాల నుంచి కొత్తగూడెం చెక్‌డ్యాం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వాగులో భారీ రాళ్లు ఉన్న కారణంగా రెస్క్యూ టీం పడవలు వెళ్లలేక కొంత ఇబ్బందులు రావడంతో స్థానిక గజ ఈతగాళ్ల సహకారంతో గాలిస్తున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట కోదాడ రూరల్‌సీఐ ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్‌ఐ నవీన్ కుమార్, కోదాడ ఫైర్ ఆఫీసర్ ముత్తినేని శ్రీనివాస్, తహసీల్దార్ హిమబిందు, ఆర్‌ఐ వెంకట నగేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఉన్నత ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు