
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఆలేరురూరల్, భువనగిరి : భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం ఆలేరు మండలంలోని కొలనుపాక, గొలనుకొండ, భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపైనుంచి ప్రవహిస్తున వరద నీటిని పరిశీలించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రోడ్లపైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజేయులు, డిప్యూడి తహసీల్దార్ ప్రదీప్ తదితరులు ఉన్నారు.