బీబీనగర్: వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చిన ద్విచక్ర వాహనదారుడు మార్గమధ్యలో దింపి ఆమైపె దాడికి పాల్పడి మెడలోని బంగారం అపహరించుకుపోయాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలో బుధవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండల పరిధిలోని ఇస్రాయిపల్లి కుంటకు చెందిన నెల్లుట్ల భారతమ్మ మంగళవారం తన బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి బుధవారం ఉదయం ఇంటికి వచ్చే క్రమంలో బీబీనగర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గల ఇస్రాయిపల్లి కుంటకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె రోడ్డుపై నిల్చోని అటుగా వస్తున్న గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగింది. బైక్‌పై ఎక్కించుకున్న ద్విచక్ర వాహనదారుడు భారతమ్మను ఇస్రాయిపల్లి కుంట రాకముందే శివారులో దించాడు. అక్కడి నుంచి భారతమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా.. సదరు ద్విచక్ర వాహనదారుడు భారతమ్మను రోడ్డు పక్కన చెట్ల పొదల్లో నెట్టివేసి ఆమైపె దాడికి పాల్పడ్డాడు. ఆమె చేతులతో పాటు మూతిని టవల్‌తో కట్టివేసి నాలుగు తులాల బంగారు చెవి పోగులు, ముక్కుపుడక, గుండ్లను అపహరించకుపోయియాడు. రోడ్డు వెంట వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు.