
సాగర్‌ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులు
నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను గురువారం నేపాల్, శ్రీలంక, రష్యా, వియత్నాం, జింబాబ్వే, నైజీరియా, ఇథియోపియా, సౌత్‌సూడాన్‌తో సహా 23 దేశాల నుంచి 27మంది ప్రతినిధులు సందర్శించారు. ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘నూతన ఆవిష్కరణలు అభివృద్ధి’ అనే అంశంపై శిక్షణ పొందుతున్న వీరు టీం కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌కు వచ్చారు. సందర్శనలో భాగంగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ పురావస్తు మ్యూజియం, మాన్యుమెంట్స్‌ను సందర్శించారు. అనంతరం సాగర్ ప్రధాన డ్యాం, బుద్ధవనంలోని పలు ప్రాంతాలను తిలకించారు. మహాస్థూపంలోని రెండవ అంతస్తులోగల ధ్యామందిరంలోని పంచముఖ బుద్ధుని వద్ద ప్రార్థనలు చేశారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ.. నాగార్జునకొండ చారిత్రక విశేషాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివరాలు, బుద్ధవనం విశేషాలను వివరించారు. వీరి వెంట డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ రఘు, సాగర్ సీఐ శ్రీనునాయక్, సాగర్ డ్యాం ఈఈ మల్లిఖార్జున్‌రావు, ఏఈ కృష్ణయ్య, బుద్ధవనం అధికారులు శాసన, రవిచంద్ర, ఆర్‌ఐ దండశ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు.