
వినాయక మండపంలో ‘ఆపరేషన్ సిందూర్’
భువనగిరి: భువనగిరి పట్టణంలోని తారకరామనగర్‌లో శ్రీమణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆపరేషన్ సిందూర్ థీమ్‌ను పోలిన ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు, త్రివిధ దళాధిపతుల సమావేశం, భారత్ సైన్యం ఉగ్రవాదులను కాల్చి చంపడం వంటి ప్రతిమలను ఒడిషా రాష్ట్రానికి చెందిన కళాకారులచే 25 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. అదేవిధంగా మండపంలో సుమారు 22 అడుగుల మట్టి వినాయక విగ్రహం ప్రతిష్ఠించారు. సుమారు 20 ఏళ్లుగా ప్రతి ఏడాది సందేశాత్మకంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.