
ఆచార్య నాగార్జునుడి బోధనలు ఆచరణీయం
నాగార్జునసాగర్: ఆచార్య నాగార్జునుడి బోధనలు నేటికీ ఆచరణీయమని ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. అమెరికాలోని చికాగోలో మిడ్ వెస్ట్ అమితాభ బౌద్ధాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆచార్య నాగార్జునుడి మార్గాలను ఆచరిస్తే ప్రస్తుత సమాజంలోని రుగ్మతలను నిర్మూలించవచ్చని వివరించారు. బుద్ధుడి బోధనలు, నాగార్జునుని తాత్వికతలను ఈ తరానికి అందించి బౌద్ధ సంస్కృతిని పరిరక్షించడానికి నాగార్జునసాగర్‌లో బుద్ధవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. అనంతరం చికాగో–మిడ్‌వెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ ప్రధానాచార్యులు పూజ్య గ్యాదోకోనో వారి ప్రచురణలను శివనాగిరెడ్డికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో చికాగో సాహితీ మిత్రులు సంస్థ కార్యదర్శి జయదేవ్ మెట్టుపల్లి పాల్గొన్నారు.
ఫ చికాగోలోని బౌద్ధాలయంలో
ప్రసంగించిన ఈమని శివనాగిరెడ్డి