
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీ భేటీ
సాక్షి, యాదాద్రి : ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ వాత్సవతో సికింద్రాబాద్ రైల్వే కార్యాలయంలో సమావేశం అయ్యారు. జిల్లాకు సంబంధించిన పలు ప్రాజెక్టులు, సమస్యలపై ఆయనతో చర్చించారు. ఎంఎంటీఎస్ పనులను వేగవంతం చేసి 2027 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కోరారు. ప్రధానంగా బీబీనగర్ – భువనగిరి మధ్య 52 ఎకరాలు భూ సేకరణ పూర్తి చేస్తేనే మిగతా పనుల్లో వేగం పెరుగుతుందన్నారు. అలాగే భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం వద్ద అండర్‌పాస్ నిర్మించాలని, రామన్నపేటలో ఫలక్‌నుమా, శబరి, నారాయణాద్రి, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు.
సమావేశంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉదయనాథ్‌కోట్ల, ఎంఎంటీఎస్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రాజెక్టులు, సమస్యలపై చర్చ