
సుర్వి బాలరాజుకు భారత్ ఐకాన్ అవార్డు
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన సామాజికవేత్త సుర్వి బాలరాజుగౌడ్ భారత్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఆస్పత్రులు, బస్టాండ్‌ల వద్ద అన్నార్థులకు ఉచితం భోజనం అందిస్తూ వారి ఆకలి, దప్పిక తీర్చుతూ బాలరాజు చేస్తున్న స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి భారత్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని లోక్‌కళ మంచ్ ఆడిటోరియంలో ఉజ్వల కల్చరల్ ఫౌండేషన్, శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ సంయుక్తంగా సింధూర్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఎల్టికల్నల్ రామ్‌శంకర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
యాదగిరి క్షేత్రంలో
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహహోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఘ నంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో వెండిజోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
ప్రసాద వితరణకు
ఆధునిక పరికరాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాద పంపిణీ వితరణ కోసం ఆధునిక పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. ఆదివారం ఆలయ ప్రసాద విభాగాన్ని తనిఖీ చేశారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్, అమ్మకాలతో పాటు పరిశుభ్రతను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని, ప్రసాదం పంపిణీ వితరణకు ఆధునిక యాంత్రిక పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అనంతరం క్యూలైన్లలో భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తక్కువ రేట్లతో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భక్తులు ఈ సందర్భంగా ఈఓ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, అధికారులు దయాకర్‌రెడ్డి, రామావు, శ్రీనివాస్ రెడ్డి, నవీన్‌కుమార్, ఆర్‌ఐ శేషగిరిరావు ఉన్నారు.

సుర్వి బాలరాజుకు భారత్ ఐకాన్ అవార్డు

సుర్వి బాలరాజుకు భారత్ ఐకాన్ అవార్డు

సుర్వి బాలరాజుకు భారత్ ఐకాన్ అవార్డు