ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది | - | Sakshi
Sakshi News home page

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది

Aug 24 2025 12:10 PM | Updated on Aug 24 2025 12:10 PM

ఇక్కడ

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది

నీలగిరిలో సందడి చేస్తున్న ఫ్రాన్స్‌ దేశస్తుడు ధ్యానం ఇష్టం ఇండియా గొప్ప దేశం

విజృంభిస్తున్న వ్యాధులు
సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
నీలగిరిలో సందడి చేస్తున్న ఫ్రాన్స్‌ దేశస్తుడు

- 9లో

రామగిరి(నల్లగొండ) : నాకు పర్యటనలు అంటే ఎంతో ఇష్టం. ఎంఎస్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ పూర్తి చేసిన నేను ఫ్రాన్స్‌ రైల్వేస్‌లో డేటా మేనేజర్‌గా పని చేస్తున్నాను. 2011లో మొదటిసారి ఢిల్లీలోని భీంటెక్‌ కంపెనీకి స్టడీ ఎక్ఛ్సేంజ్‌ కార్యక్రమానికి ఇండియా వచ్చాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు ఎంతో నచ్చాయి. ఇప్పటికి ఎనిమిది సార్లు ఇండియాలో పర్యటించాను. నేపాల్‌ దేశాన్ని కూడా సందర్శించాను. ఇండియాలోని 14 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రదేశాలను వీక్షించాను. ఇక్కడి హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, లడక్‌, టిబెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం.

భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఆడ్రిన్‌

ఈ ఏడాది జూలైలో ఢిల్లీకి వచ్చాను. రాజస్థాన్‌లోని జైపూర్‌, లడక్‌, కార్గిల్‌ను సందర్శించాను. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాను. ఆగస్టులో హైదరాబాద్‌ వచ్చి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ విపాసన ధ్యాన కేంద్రానికి వెళ్లాను. వారం రోజుల పాటు అక్కడ ధ్యానంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడికి వలంటీర్‌గా వచ్చిన నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన నితిన్‌తో పరిచయం ఏర్పడింది. అతని ఆహ్వానం మేరకు ఆగస్టు 17న కంచనపల్లికి వచ్చాను.

ఇండియా గొప్ప దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. అనేక భాషలు మాట్లాడుతారు. పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇటీవల వెళ్లిన అమర్‌నాథ్‌ యాత్ర ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇండియాలో నేను ఎక్కువగా నార్త్‌ ఇండియా సందర్శించాను. ఇప్పుడు మొదటిసారి సౌత్‌ ఇండియాకు వచ్చాను. ఇండియాలో నేర్చుకున్న ధ్యానం జీవనానికి, ఉద్యోగరీత్యా చాలా ఉపయోగపడుతుంది. హిందూ, బుద్ధిజం అంటే ఇష్టపడతాను. తీరిక సమయాల్లో రామాయణం, భగవద్గీత చదువుతాను.

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది1
1/3

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది2
2/3

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది3
3/3

ఇక్కడి సంస్కృతి ఎంతో నచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement