
ముఖ్య అర్చకుడిగా శ్రీకాంతాచార్యులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖ్య అర్చకుడిగా కలకోట శ్రీకాంతాచార్యులు నియమితులయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఆయనకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు పదవీ విరమణ పొందారు. దీంతో ప్రధానార్చకుడు–2గా ఉన్న ఉప ప్రధానార్చకుడు సురేంద్రచార్యులకు పదోన్నతి వచ్చింది. ఆయన స్థానంలో ముఖ్య అర్చకుడైన మంగళంపల్లి నరసింహమూర్తికి ఉప ప్రధానార్చకులుగా ఈ నెల 15వ తేదీన పదోన్నతి కల్పించారు. ముఖ్య అర్చకుడి పోస్టును అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న కలకోట శ్రీకాంతాచార్యులతో భర్తీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈఓ వెంకట్రావ్, దేవాదాయశాఖ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
భువనగిరి: ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం భువనగిరి పట్టణంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పా శం కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా కె.వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా ఎంఏ సలీం, ఆర్.సవిత, ఎం.ఆనందరావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్.లింగయ్య, సంయుక్త కార్యదర్శులుగా కె.మల్లేష్, వి.శ్యాంసుందర్, ఎన్.సుదర్శన్‌రెడ్డి, కోశాధికారిగా ఏ.సుధాకర్, మహిళా కార్యదర్శిగా ప్రతిభ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైదుల్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు కాసం ప్రభాకర్, కోశాధికారి శ్రవణ్‌కుమార్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్‌నెట్, కేబుల్ టీవీల
వైర్లు తొలగింపు
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో కేబుల్ టీవీలు, ఇంటర్‌నెట్ సంస్థలు విద్యుత్ స్తంభాల ఆధారంగా ఏర్పాటు చేసిన వైర్లు ప్రమాదకరంగా మారాయి. దీ నిపై ‘మృత్యుపాశాలు’ శీర్షికన శనివారం సాక్షి ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. విద్యానగర్, కిసాన్‌నగర్‌లో పలుచోట్ల స్తంభాలకు వేలాడుతున్న వైర్లను తొలగించారు. సమాచారం అందుకున్న కేబుల్ అపరేటర్లు అక్కడికి చేరుకుని గడువు ఇవ్వాలని విద్యుత్ అధికారులను వేడుకున్నారు. అయినా ప్రమాదకరంగా ఉన్న వైర్లను తొలగిస్తుండటంతో ఆపరేటర్లు ఎస్‌ఈ కార్యాలయానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గడువు ఇస్తే తామే స్వయంగా సరిచేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్‌నెట్, కేబుల్ టీవీల వైర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, తొలగించాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు విద్యుత్ శాఖ ఏడీఈ ఆనంద్‌రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో వైర్లను సరి చేయాలని, లేనిపక్షంలో తామే పూర్తిస్థాయిలో తొలగిస్తామని హెచ్చరించారు.

ముఖ్య అర్చకుడిగా శ్రీకాంతాచార్యులు

ముఖ్య అర్చకుడిగా శ్రీకాంతాచార్యులు