
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తుందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను శనివారం వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిచందన్నారు. రామన్నపేట ఆస్పత్రి అభివృద్ధికి నిధుల కోసం త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని, వైద్యారోగ్యశాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అనంతరం కొమ్మాయిగూడెం ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణపనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నూతన కోర్టు భవనాలు నిర్మించే ప్రదేశానికి రోడ్డు, కల్వర్టులు మంజూరు చేయాలని బార్ అసోషియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ చిన్నానాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి, బత్తుల క్రిష్ణగౌడ్, ఎండీ రెహాన్, అక్రం, గోదాసు పృథ్వీరాజ్, జెల్ల వెంకటేశం, గుత్తా నర్సిరెడ్డి, పూస బాలనర్సింహ, తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, పెద్దగోని వెంకటేశం, గంపల రామచంద్రారెడ్డి, మడూరి జ్యోతి, తాటిపాముల శేఖర్, పిట్ట రాంరెడ్డి, ఎర్ర శేఖర్, కూనూరు కృష్ణగౌడ్, బత్తుల నవీన్, నోముల ప్రవీన్, పరమేష్ పాల్గొన్నారు.
ఎంపీ చామల, ఎమ్మెల్యే వీరేశం