
యూరియా కష్టాలు
తుర్కపల్లి: యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగుపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకుముందే వరి నాట్లేసిన రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద ఎదురుచూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తిస్థాయిలో అందడం లేదని వాపోతున్నారు. శనివారం ఉదయం నుంచే తుర్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి రైతులు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. గంటల తరబడి నిరీక్షించినా ఎకరానికి ఒక్క బస్తా చొప్పున మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.