
లైటింగ్ మెరుగుపర్చాలి
ఫ ఈఓ వెంకట్రావ్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట క్షేత్రానికి లైటింగ్ మరింత మెరుగుపర్చాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం రాత్రి ఆయన ఆలయ క్యూలైన్లు, లైటింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులను ఆకర్షించే విధంగా లైటింగ్‌ను మెరుగుపర్చాలన్నారు. అంతేకాకుండా ఆలయ భద్రత, క్యూలైన్ల నిర్వహణ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులందరికీ ఉచిత ప్రసాదం తప్పనిసరిగా అందించాలన్నారు. అంతకుముందు భక్తులతో మాట్లాడి వసతి సదుపాయాలు, సౌకర్యాలు, ప్రసాదం ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయన వెంట ఆలయాధికారి కృష్ణ, ఆర్‌ఐ శేషగిరిరావు తదితరులున్నారు.