
సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి
రామగిరి(నల్లగొండ): సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ ఏఎస్పీ జి. రమేష్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్స్, ఎన్‌సీసీ, పీస్ ఫోరం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ రమేష్, సైబర్ క్రైం డీఎస్పీ టి.లక్ష్మీనారాయణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. పి.మద్దిలేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల్లో ఎక్కువగా మొబైల్ ద్వారా జరుగుతున్నాయన్నారు. ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించారు. కార్యక్రమంలో పీస్ ఫోరం ట్రస్ట్ ఫౌండర్ హెచ్. దయానంద, తెలుగుశాఖ అధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, పీస్ ఫోరం సభ్యులు అశోక్‌వర్ధన్, ఎన్‌సీసీ కేర్‌టేకర్ సీహెచ్. సుధాకర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకట్‌రెడ్డి, డాక్టర్ ఏ. మల్లేశం, డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్, కె. శివరాణి, ఎం. సావిత్రి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్స్, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.