
హైలెవల్ కష్టాలు
మూసీపై ఏళ్లుగా తీరని వెతలు
మోత్కూరు–గుండాల మధ్య 50 ఏళ్ల కిత్రం నిర్మించిన బ్రిడ్జే దిక్కు
లోలెవల్ వంతెనలు..
సాక్షి, యాదాద్రి: భారీ వర్షాలు కురిసినప్పుడలా జిల్లాలోని పలు మార్గాల్లో అవస్థలు తప్పడం లేదు. లోలెవల్ వంతెనలు, కాజ్‌వేలు విస్తరణకు నోచుకోక రాకపోకలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వరద ఉధృతిలోనే ప్రయాణం సాగిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వాలు మారినా కాజ్‌వే కష్టాలు తీరడం లేదు. మూసీ, ఆలేరు, బిక్కేరు. చిన్నేరు, శామీర్‌పేటతో పాటు పలు స్థానిక వాగులపై సుమారు 60 వరకు కల్వర్టులు, కాజ్‌వేలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇందులో కొన్ని చోట్ల పనులు మొదలై వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని కాజ్‌వేలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు.
లో లెవల్ బ్రిడ్జిలున్న మార్గాలు ఇవీ..
మూసీపై రుద్రవెల్లి–జూలూరు, బొల్లెపల్లి–సంగెం వద్ద లో లెవల్ వంతెనలున్నాయి. వీటితో పాటు నలగొండ రోడ్డులో నాగిరెడ్డిపల్లి, పల్లెర్ల, నర్సాపూర్, తుమ్మలగూడెం, లోతుకుంట, నర్సాయిగూడెం. వేములకొండ, మల్లేపల్లి– వేములకొండ, మల్లేపల్లి–వెల్వర్తి, జాలుకాలువ, రెడ్లరేపాక రోడ్లు, బీబీనగర్ మండలం రాఘవాపూర్, జైనంపల్లి రోడ్డు, జైనపల్లి – అనంతారం రోడ్డు, అవుషాపూర్ – రాయరావుపేట, చీకటిమామిడి–మాచన్‌పల్లి, మర్యాల – వడపర్తి, ఫకీర్‌గూడెం – తాజ్‌పూర్, రామలింగంపల్లి–తూముకుంట, గంధమల్ల –రాజాపేట, కోనాపూర్ రోడ్డు, పాముకుంట, రాజాపేట, పారుపల్లి –రాజాపేట, నెమిల – రాజాపేట, దూదివెంకటాపూర్ – రాజాపేట, పొట్టిమర్రి–కాల్వపల్లి, బేగంపేట–రేణికుంట, ఆలేరు – కొలనుపాక, కాలనుపాక జంగాలకాలనీ, కొలనుపాక పీతాంబర్ వాగు, ఆలేరు సిల్క్‌నగర్ వాగు, మంతపురి–దిలావర్‌పూర్, శారాజీపేట, గొలనుకొండ – అమ్మనబోలు, శర్బనాపురం, బండకొత్తపల్లి – వస్తాకొండూరు, వస్తాకొండూరు–పెద్దపడిశాల, మరిపడి – సీతారాంపూర్, వెల్మజాల – కొమ్మాయపల్లి, తంగెడిపల్లి, చౌటుప్పల్ –తంగెడిపల్లి, మోత్కూరు–గుండాల మార్గాల్లో లోలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో స్థానిక వాగులు, బిక్కేరు, శామీర్‌పేట, ఆలేరు వాగులు ఉధృతంగా ప్రవహించినప్పుడు వంతెనల పైనుంచి రాకపోకలు స్తంభించిపోతాయి.
కొట్టుకుపోయిన కారు
చౌటుప్పల్ మండలం నేలపట్ల–వర్కట్‌పల్లి మధ్య వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ మార్గంలో వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్థానికులతో సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.
నిధులున్నా పనులేవీ?
ఆలేరు మండలం కొలనుపాకకు రెండు వైపులా సిద్ధిపేట మార్గంలో ఉన్న కాజ్‌వేలపై హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కావడంలేదు. గంధమల్ల చెరువు అలుగుపోస్తే కొలనుపాక వాగులోకి చేరుతుంది. ఈ సమయంలో ప్రయాణికులను రోడ్డు దాటనీయదు. దీంతో బచ్చన్నపేట, చేర్యాల, సిద్ధిపేట, రాజాపేట మార్గంలో వెళ్లే వాహనాలు చుట్టూ తిరిగిపోవాలి. ధైర్యం చేసి వాగు దాటడానికి ప్రయత్నించిన సందర్భంలో పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోగా మరికొందరు స్థానికుల సాయంతో బయటపడ్డారు.
భువనగిరి మండలం బొల్లేపల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద, బీబీనగర్ మండలం రుద్రవెల్లి–భూదాన్‌పోచంపల్లి మండలం జూలురు మధ్య మూసీపై లోలెవల్ వంతెనలు ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిందంటే లో లెవల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గినన్ని రోజులు రాకపోకలు నిలిచిపోతాయి. రుద్రవెల్లి–జూలూరు లోలెవల్ బ్రిడ్జికి సమీపంలోనే ఏడేళ్ల క్రితం చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలో మూసీ పునరుజ్జీవన యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంగెం బిడ్రిని సందర్శించారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
ప్రమాదకరంగా లోలెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు
ఫ భారీ వర్షాలు కురిసిన ప్రతీసారివంతెనల పైనుంచి వరద
ఫ స్తంభిస్తున్న రాకపోకలు
ఫ అత్యవసర సమయంలో వాగులు
దాటే క్రమంలో ప్రమాదాలు
గత ఏడాది వానాకాలంలో ఓ ప్రయాణికుడు ఆలేరు రోడ్డుపై కొలనుపాక వాగు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి సదరు వ్యక్తిని కాపాడారు. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా రక్షణ చర్యలు తీసుకోకపోవడం సంబంధిత శాఖల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది.
మోత్కూర్–గుండాల మధ్య బిక్కేరు వాగుపై హైలెల్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో వాహనదారులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. వరదలు వచ్చినప్పుడు రోడ్డు దాటడానికి వీలుండదు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తామని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు హామీలిచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈ వంతెనను విస్తరిస్తే ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు 50 కిలోమీటర్ల దూరభారం తగ్గడమే కాకుండా వరదలు వచ్చినా ప్రయాణానికి ఆటంకాలు ఉండవు.

హైలెవల్ కష్టాలు

హైలెవల్ కష్టాలు

హైలెవల్ కష్టాలు