
మృత్యుపాశాలు..
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఇంటర్‌నెట్, కేబుల్ టీవీల తీగలు వేయడానికి స్తంభాలను ఉపయోగించినప్పుడు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్తంభం చొప్పున నిర్దేశిత రుసుము చెల్లించాలి. కానీ, చాలా చోట్ల అమలు కావడం లేదు. కొందరు యజమానులు విద్యుత్ సిబ్బందితో కుమ్మకై ఇష్టారాజ్యంగా వైర్లు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
భువనగిరి టౌన్: ప్రైవేట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ స్తంభాలను తమ సొంతానికి వాడుకుంటున్నాయి. విద్యుత్ సరఫరా కోసం రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్తంభాల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు ఇష్టారాజ్యంగా కేబుళ్లను అనుసంధానిస్తున్నాయి. ఫలితంగా ఈ వైర్లు తెగి కరెంటు లైన్లు, స్తంభాలపై పడినప్పుడు విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా స్తంభాలపై ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు చేయలేకపోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో టీవీ, ఇంటర్‌నెట్ కేబుల్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కేబుల్స్ తొలగించాలని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఏ స్తంభానికి చూసినా గుట్టలుగా కేబుల్స్
ప్రైవేటు సంస్థల కేబుల్ విస్తరణ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. భువనగిరి పట్టణంలో త్రీ ఫేజ్, టూఫేజ్, చివరికి హైటెన్షన్ స్తంభాలను కూడా అనధికారికంగా వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఉండాలి. కానీ, తక్కువ ఎత్తులో లాగడంతో కిందకు వేలాడుతున్నాయి. అంతేకాకుండా వైర్లను కుప్పలుగా స్తంభాలకు చుట్టేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇష్టారాజ్యంగా స్తంభాలను కేబుళ్ల కోసం వాడుకుంటున్నారు.
వాహనాలు వెళ్లిన
సమయంలో ప్రమాదాలు
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లోని కాలనీల్లో చిన్నచిన్న రోడ్లపై ఒకవైపు ఇళ్ల నుంచి మరోవైపున ఉన్న నివాసాలకు కేబుళ్లను రోడ్డుకు అడ్డంగా లాగుతున్నారు. ఇవి తక్కువ ఎత్తులో ఉంటే వాహనాలు వెళ్లిన సమయంలో వాటికి తగిలి తెగిపోతున్నాయి. విద్యుత్‌లైన్లు, స్తంభాలపై పడి వేలాడుతున్నాయి.
నోటీసులతోనే సరిపెట్టారు.. టీవీలు, ఇంటర్‌నెట్ వైర్లను తొలగించాలని ఆయా సంస్థల యజమానులకు ఏడాది క్రితం విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత వాటి గురించే మరిచిపోయింది. ఈనెల 27నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఆ తరువాత దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వరుసగా రానున్నాయి. నిర్వాహకులు భారీ విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం సందర్భంగా విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఈ తరుణంలో కిందకు వేలాడుతున్న తీగల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. తక్షణమే కేబుల్ టీవీలు, ఇంటర్నెట్ సంస్థల కేబుల్స్‌ను తొలగించాలని ప్రజలు, ఉత్సవ మండపాల నిర్వాహ కులు కోరుతున్నారు.
విద్యుత్ స్తంభాల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ సంస్థలు వైర్లు లాగాలంటే
అనుమతి తప్పనిసరి.
ఒక్కో స్తంభానికి రూ.50 నుంచి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
కనీసం 15 అడుగుల ఎత్తులో కేబుల్స్ ఏర్పాటు చేసుకోవాలి.
సపోర్టింగ్ వైర్, కేబుల్ బరువు మీటరుకు గరిష్టంగా 200 గ్రాములు మించవద్దు.
తీగ పొడవు స్తంభానికి, స్తంభానికి మధ్య 50 మీటర్లు మించకుండా ఉండాలి.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసినవి, తక్కువ ఎత్తులో ఉన్నవి, ప్రమాదకరంగా ఉన్న తీగలను అధికారులు ఎప్పటికప్పుడు తొలగించాలి.
కరెంట్ పోల్స్‌కు ఇష్టారాజ్యంగా ఇంటర్‌నెట్, కేబుల్ టీవీల వైర్లు
ఫ తక్కువ ఎత్తులో అడ్డదిడ్డంగాఏర్పాటు చేస్తున్న ఆపరేటర్లు
ఫ పొంచి ఉన్న ప్రమాదాలు.. స్తంభాలపై సమస్య తలెత్తినా మరమ్మతులు చేయలేని పరిస్థితి
ఫ తొలగించాలని గతంలోనే ఉన్నతస్థాయి ఆదేశాలు
ఫ హైదరాబాద్ ఘటనతోనూ మేల్కోని యంత్రాంగం

మృత్యుపాశాలు..

మృత్యుపాశాలు..