
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
త్రిపురారం : మార్కెట్‌లో నానో యూరియా, డీఏపీ అందుబాటులోకి వచ్చాయి. ఇది సంప్రదాయ గుళికల యూరి యాకు బదులుగా వాడే ద్రవరూప ఎరువు. మొక్కలకు నానో యూరియా అధిక నత్రజనిని అందిస్తుంది. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఎరువు 20 నుంచి 50 మిల్లీ మైక్రాన్‌ల పరిమాణంలో నత్రజని కణాలు ఉంటాయి. దీన్ని మొక్కలు సులభంగా గ్రహిస్తాయి. ద్రవరూపంలోని నానో యూరియా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతే కాదు పంట దిగుబడిని పెంచి, పర్యావరణానికి మేలు చేస్తుంది.ది గుబడి, రైతుకు ఆదాయం పెంచుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. నానో యూరి యాను సులభంగా నిల్వ, రవాణా చేయవచ్చు.
ధరలు ఇలా..
నానో యూరియాను అన్ని రకాల పంటలకు వాడవచ్చు. ఒక్క బాటిల్ (500 మి.లీ.) వినియోగిస్తే 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానమని అధికారులు చెబుతున్నారు. 45 కిలోల యూరియా బస్తా రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.220, డీఏపీ బస్తా రూ.1,350 ఉండగా, అర లీటర్ నానో డీఏపీ రూ.600కు లభిస్తుంది.
వినియోగించే పద్ధతులు
● 500 ఎంఎల్ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు.
● 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి.
● ఇతర పురుగుమందులు కలిపి పిచికారీ చేయొద్దు.
● నానో యూరియా వాడకం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు.
● సాధారణ యూరియతో పోల్చితే నానో యూరియా ప్రభావం మొక్కలపై ఎక్కువ రోజులు ఉంటుంది.
● 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు నానో యూ రియాను పిచికారీ చేయాలి.
● యూరియా వేసే ప్రతి పంటలకు నానో యూరియాను వినియోగించుకోవచ్చు.
రైతులకు అవగాహన కల్పిస్తున్న
వ్యవసాయ అధికారులు
మార్కెట్‌లోకి ద్రవరూప యూరియా, డీఏపీ
ఫ సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా..
ఫ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి