
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
యాదగిరిగుట్ట: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌నా యుడు, తహసీల్దార్ గణేష్‌నాయక్ సూచించారు. యాదగిరిగుట్ట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం గణేష్ మండప నిర్వాహకులు, ముస్లింలు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గణేష విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు, శోభాయాత్ర రోజు విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలన్నారు. సోదరభావంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, వైద్యాధికారి పావణి, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ట్రాన్స్‌కో ఏఈ సురేంద్రనాయుడు, ఎంపీడీఓ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం
ఆలేరు: పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఽశుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఉన్నట్లుండి వేప చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఎగ్జిట్ పాయింట్ సమయంలో ఉన్న వేప చెట్టు కింద అప్పటి వరకు పలువురు మాట్లాడుకుంటున్నారు. చెట్ల కొమ్మలు విరిగిపడుతుండగా గమనించి అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచండి
భువనగిరి: ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలు పెంచా లని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. గురువారం తన చాంబర్‌లో ఓపెన్ స్కూల్ విద్యకు సంబంధించిన పోస్టర్‌ను విద్యాశాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. స్వయం సహాయ సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, ఆశ కార్యకర్తలు మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్‌లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్ సత్తమ్మ, జిల్లా విద్యాశాఖ ఏడీ ప్రశాంత్‌రెడ్డి, సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, వయోజన విద్యా ప్రాజెక్టు అధికారి మమత, సహాయ ప్రాజెక్టు అధికారి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు