
భోజనం వడ్డించి.. సమస్యలు తెలుసుకొని
బీబీనగర్: విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి రుచి, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.. కలెక్టర్ హనుమంతురావు. బీబీనగర్ మండలం కొండమడుగు జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు తానే భో జనం వడ్డించారు. సమస్యలపై ఆరా తీశారు. మోనూ ప్రకారం భోజనం అందజేయాలని సిబ్బందికి సూచించారు. అడ్మిషన్లు పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. తప్పులు లేకుండా 12వ గుణితం చెప్పిన అవినాష్ అనే విద్యార్థిని కలెక్టర్ అభినందించారు. అనంతరం పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేసి రోగులు పొందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులు, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు.

భోజనం వడ్డించి.. సమస్యలు తెలుసుకొని