
యూరియా కొరత వదంతులను నమ్మొద్దు
ఆత్మకూరు(ఎం): అవసరం మేరకు యూరియా ఉందని, రైతులు కొరత వదంతులను నమ్మొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో నరేష్ అగ్రిమాల్ ఎరువుల షాప్‌ను తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రికార్డులను, ఎరువుల ధరలకు సంబంధించిన పట్టిను పరిశీలించారు. నాలుగైదు రోజుల్లో జిల్లాకు వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు చెప్పారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కాన్పులు పెంచాలని, నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములునాయక్, వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, ఏఈఓ సరిత ఉన్నారు.