
అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి
భువనగిరిటౌన్ : అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లాలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లతో కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం, గర్భిణులు, బాలింతల హాజరుశాతం పెంచే విధంగా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యలక్ష్మీ భోజనం మెనూ ప్రకారం పెట్టాలన్నారు. ఆధార్ అప్‌డేషన్ లేని లబ్ధిదారుల వివరాలు సేకరించి, ఆధార్ క్యాంపులు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు ప్రతి రోజు అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించి టూర్ డైరీలు సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు, సీడీపీఓ జ్యోత్స్న, స్వరాజ్యం, శైలజ, సమీరా, యామిని, జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలి
భువనగిరిటౌన్ : భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో పాడి రైతులు, గొర్రెల మేకల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి జానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలను లోతట్టు ప్రాంతాల్లో మేపేందుకు వెళ్లొద్దని సూచించారు. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి
బీబీనగర్: ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల్లో నైపుణ్యాన్ని పెంచుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. బీబీనగర్ మండల స్థాయి టీఎల్‌ఎమ్(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) కార్యక్రమాన్ని నెమురగొముల పరిధిలోని వీఎల్‌ఎన్ గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచింగ్‌కు సంబంధించిన మెటిరీయల్ ప్రదర్శనల్లో ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, ఎంఈఓ సురేష్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చంద్రారెడ్డి, దివాకర్‌యాదవ్, ఉమాదేవి, ఇందిరప్రేమజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
గంధమల్ల చెరువుకు ప్రభుత్వ విప్ పూజలు
తుర్కపల్లి: మండలంలోని గంధమల్ల చెరువుకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు చీర, కుంకుమ, పసుపు సమర్పించి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, అలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, చాడ భాస్కర్ రెడ్డి, ఐలయ్య, రాములు, మోహన్ బాబు, తహసీల్దార్, దేశ్యానాయక్, ఎస్‌ఐ తక్యూద్దీన్ పాల్గొన్నారు.
పత్తిలో గులాబీరంగు
పురుగును నివారించాలి
సంస్థాన్ నారాయణపురం : పత్తిలో గులాబీరంగు పురుగును నివారించాలని కేవీకే ప్రొగ్రాం కో–ఆర్డ్డినేటర్ అనిల్‌కుమార్, శాస్త్రవేతలు అఖిలేష్, కల్పిష్ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎల్‌డీసీ, కేవైఏర్‌డీ సంయుక్తంగా పత్తి పంటలో పాటించాల్సి సస్యరక్షణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో భువనగిరి ఏడీఏ వెంకటేశ్వర్లు, ఏఓ వర్షిత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, ఏఈవోలు రవితేజ, బీ.శివకుమార్, నవ్య పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి

అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి